Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2025, 6:35 pm Posted by : ramakrishna

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరవధిక నిరసన దీక్ష

పోతంగల్, బతుకమ్మ: పోతంగల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో  నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం మాట్లాడుతూ…రాష్టంలో  ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యేంతవరకు  అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను అమలు చేసి తమ బిడ్డల భావితరాల భవిష్యత్తుకు బాటలు వేయాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల యాదవ్ రావు, ఉపాధ్యక్షుడు కర్రోళ్ల సాయిలు, ప్రధాన కార్యదర్శి మేత్రి సంగయ్య, సహాయ కార్యదర్శి మేత్రి లాలయ్య, కార్యదర్శి జెండ వెంకటి,బండారి బాలయ్య,గంగారాం,ఈరయ్య తదితరులు పాల్గొన్నారు.