కామారెడ్డి, బతుకమ్మ :
చీట్టీల డబ్బులు చెల్లించడం లేదంటూ ఓ బాధితుడు ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. తనకు రావాల్సిన డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, పలుమార్లు దాడి చేశారని ఆరోపించాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం జనగామ గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ వద్ద 5 లక్షల చిట్టీ వేయడం జరిగిందని, చిట్టి డబ్బులు పూర్తిగా కట్టడం జరిగిందని, చిట్టి గడువు ముగిసి 18 నెలలు గడిచిన చిట్టి డబ్బులు ఇవ్వకుండా ప్రతాప్ నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించారు. తనకు రావాల్సిన 4 లక్షల 30 వేల కోసం పలుమార్లు అడిగినా డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు అడిగేందుకు ప్రతాప్ ఇంటికి వెళ్లిన సమయంలో పలుమార్లు తన పై దాడి చేశాడని ఆరోపించాడు. దీంతో విసిగిపోయిన సంతోష్ రెడ్డి.అడ్లూరు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. తనకు న్యాయం చేసి,నాకు రావాల్సిన 4 లక్షల 30 వేల రూపాయలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాడు.ఈ విషయం పై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదనీ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో చేసేది ఏమి లేక ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరిగిందని పేర్కొన్నారు. నాకు న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్షను విరమించేది లేదని పేర్కొన్నాడు.
