- ఒకరి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు
నందిపేట, బతుకమ్మ: నందిపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఒకరు జైలుకు వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. నందిపేట ఎస్‌ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక కూలీ పనుల కోసం నందిపేటకు చెందిన నాగనాథ్ అలియాస్ నగేష్ మేస్త్రి వద్దకు వెళ్లింది. అయితే, నిందితుడు ఆమెను చేయి పట్టి లాగుతూ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తు బాధితురాలి కుటుంబ సభ్యులు నందిపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఒకరిని అరెస్టు చేసి, శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం అతడిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.