Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2025, 4:06 pm Posted by : ramakrishna

జాబ్ మేళాకు అపూర్వ స్పందన

బోధన్, బతుకమ్మ : మంజీర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా కు అపూర్వ స్పందన వచ్చిందని కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ మరియు పిజీ కళాశాలలో ఎంఎస్ఎన్ కంపెనీ, టాస్క్ తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ అర్హతకు తగ్గ ఉపాధి లభించినప్పుడే జీవితానికి సంతృప్తి లభిస్తుందని, కావున ప్రతి ఒక్కరూ తమ చదువు తర్వాత ఉపాధిని సంపాదించుకోవాలన్నారు, మా కళాశాలలో విద్యా బోధనతో పాటు వారికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ జాబ్ మేళాలో వందకు పైగా నిరుద్యోగులు, విద్యార్థులు హాజరయ్యారన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు జనార్ధన్, సీతారాం, టాస్క్ ప్రతినిధులు తుకారాం, శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, డైరెక్టర్ సురేష్ గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.