పెరిగిన కరువుభత్యం అమలు చేయాలి

టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ,   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం అమలు చేయాలని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ అనుబంధం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీడీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులను కలిసి నోటీసు ఇచ్చి, యూనియన్ కార్యాలయం శ్రామిక భవన్, కోటగల్లిలో విలేకరుల  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో...