రైతుకు పెట్టుబడి సాయం పెంచడం హర్షనీయం
ఆర్మూర్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచడం హర్షనీయమని బీజేపీ సీనియర్ నాయకులు బండి శ్రీహరి, డీసీ ముత్తెన్న అన్నారు. మండలంలోని ఇస్సపల్లి లో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగావారు మాట్లాడారు. ప్రధాని మోడీ రైతు పక్షపాతి అని మరొకసారి నిరూపించుకున్నారని తెలిపారు. భారత దేశం లో నివసిస్తున్న నిరుపేదలకు 2 కోట్ల ఇండ్ల నిర్మాణం చెయ్యాలని మోడీజీ కంకణం కట్టుకున్నారని, పల్లెల అభిరుద్ది మోడీజీ నాయకత్వం లో బీజేపీ...