Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 4:09 pm Posted by : ramakrishna

రైతుకు పెట్టుబడి సాయం పెంచడం హర్షనీయం

ఆర్మూర్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచడం హర్షనీయమని బీజేపీ సీనియర్ నాయకులు బండి శ్రీహరి, డీసీ ముత్తెన్న అన్నారు. మండలంలోని ఇస్సపల్లి లో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగావారు మాట్లాడారు. ప్రధాని మోడీ రైతు పక్షపాతి అని మరొకసారి నిరూపించుకున్నారని తెలిపారు. భారత దేశం లో నివసిస్తున్న నిరుపేదలకు 2 కోట్ల ఇండ్ల నిర్మాణం చెయ్యాలని మోడీజీ కంకణం కట్టుకున్నారని, పల్లెల అభిరుద్ది మోడీజీ నాయకత్వం లో బీజేపీ కే సాధ్యం అని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్స్, సీసీ డ్రైనేజీ, వైకుంఠ ధమాలు, స్వచ్ఛ భారత్ కింద మరుగుదోడ్లు, చెట్ల పెంపకం, రేషన్ ద్వారా నిరుపేదలకు బియ్యం ఇవ్వడం మోడీజీ కే సాధ్యం అని అన్నారు.  మోడీకి రైతుల తరపున, పేద ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశం లో బీజేపీ నాయకులు శెట్పల్లి ముతేన్న, సందుల ముతేన్న, కే.ముతేన్న, కౌడా నర్సింలు పాల్గొన్నారు.