Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 August 2025, 10:39 pm Posted by : ramakrishna

కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరికలు

బతుకమ్మ, కోటగిరి : వర్ని మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్, కోటగిరి మండలం మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్ లు  ఆదివారం బాన్సువాడ బిఆర్ఎస్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్  ఆధ్వర్యంలో  కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా యాలమంచిలి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఈ నెల 28 వ తేదీన కేటీఆర్ సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గం నుండి సుమారు వేయి మంది  కాంగ్రెస్ కార్యకర్తల  భారీ స్థాయి లో బిఆర్ఎస్ పార్టీ లో చేరెందుకు  ముహూర్తం ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు.