ఆగని ఇసుక అక్రమ రవాణా

- అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా తరలింపు  - బరితెగించిన ఇసుకాసురులు  - అధికార పార్టీ అండదండాలు  - పట్టించుకోని అధికారులు  రుద్రూర్, బతుకమ్మ : జిల్లాలో అభివృద్ధి పనుల పేరిట మంజీరా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. బరితెగించిన ఇసుకాసురులు యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక త్రవ్వకాలు చేపడుతున్నారు. మంజీరా నది నుండి పోతంగల్, కోటగిరి, రుద్రూర్ గ్రామాల...