మోర్తాడ్, బతుకమ్మ : ప్రతి విద్యార్థులు అంతర్గతంగా ప్రతిభ దాగి ఉంటుందని దాన్ని గుర్తిస్తే విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించని సుంకేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ అన్నారు. ఎఫ్ ఏ 1 పరీక్షల్లో మంచి ప్రతిభ చూపించి ముందు స్థానంలో నిలిచిన విద్యార్థులకు సోమవారం బ్రీజర్ సూటు, మంచి బహుమతిని అందజేయడం జరిగింది. పాఠశాలలో నిర్వహించే ఎఫ్ ఏ వన్ , ఎఫ్ ఎ 2ఎగ్జామ్స్ లో ప్రతిభ చూపించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతిసారి వేసుకోవడానికి బ్రీజర్ తో పాటు బహుమతి అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.