ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వాల్ క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వాల్ క్యాలెండర్ ను సోమవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆవిష్కరించారు. నుడా చైర్మన్ కేశవేణు, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నగర మేయర్ నీతూ కిరణ్, విద్యాశాఖ జిల్లా అధికారి పి.అశోక్, డిసిబి సెక్రెటరీ బి.సీతయ్య టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేశపురం రమేష్, మల్లమారి మల్లిఖార్జున్, అలూర్ ఎంఈఓ నరేంధర్, వేల్పూర్ ఎంఈఓ రేణుక, జీహెచ్ఎం ఇందిర, జిల్లా కోశాధికారి మోర్తాడ్ మహేష్,...