తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం జిల్లా విద్యాధికారి అశోక్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఈఓ అశోక్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక విద్యార్థుల సమస్యలపై  పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘం టివియువి అన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించడంలో టివియువి ప్రముఖ పాత్ర వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టివియువి రాష్ట్ర కో వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ సింగ్, నిజామాబాద్ నగర కన్వీనర్, సుభాష్, నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.