Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2025, 6:33 pm Posted by : ramakrishna

తెలంగాణ యూనివర్సిటీ డైరీ ఆవిష్కరణ

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం తెలంగాణ వర్సిటీ డైరీ ని   వైస్ -ఛాన్స్లర్ టి.యాదగిరి రావు తన చాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ టి.యాదగిరిరావు మాట్లాడుతూ డైరీలో విశ్వవిద్యాలయం సంబంధించిన ముఖ్యమైన సమాచారం, విద్యా కార్యక్రమాలు, ఇతర ఉపయోగకరమైన వివరాలు ఉన్నాయన్నారు. ఇది కేవలం ఒక డైరీ మాత్రమే కాదని ఇది మన సమిష్టి కృషిని, మన ప్రగతిని,  మన నిరంతర శ్రమను ప్రతిఫలించే ప్రతీక అన్నారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో టీచింగ్, నాన్ టీచింగ్ సమన్వయంతో పనిచేసి  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో  విశ్వవిద్యాలయాన్ని  రాష్ట్రంలోనే  అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. ఈ డైరీ ని అద్భుతంగా రూపొందించడంలో విశేష కృషి చేసిన  పబ్లికేషన్ సెల్ డైరెక్టర్  డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పబ్లికేషన్ సెల్  డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి,  ఆడిట్  సెల్ డైరెక్టర్ గంట చంద్రశేఖర్,  కంట్రోలర్ ఆచార్య  ఎం.అరుణ, యూజీసీ కోఆర్డినేటర్,  డీన్లు ఆచార్య లావణ్య,  ఆచార్య ఆపర్ణ, ఆచార్య రాంబాబు, ఆచార్య సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Inauguration of Telangana University Diary