శోద్ కాంక్లేవ్ బ్రోచర్స్ ఆవిష్కరణ
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : 2024 నవంబర్ 8, 9 తేదీల్లో జేఎన్టీయూ హైదరాబాద్‌లో జరగనున్న జోనల్ రీసెర్చ్ స్కాలర్ కాన్క్లేవ్ ఆన్ రీసెర్చ్ ఫర్ రేడియంట్ భారత్ పోస్టర్ ను తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరి రావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమాన్ని పరిశోధన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిశోధనలలో లోతైన అధ్యయనం జరగాలని , నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, సమాజంలో బాధ్యతాయుతమైన అంశాల పైన పరిశోధనకు కృషి చేయాలన్నారు. ఈ...