Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2024, 5:40 pm Posted by : ramakrishna

శోద్ కాంక్లేవ్ బ్రోచర్స్ ఆవిష్కరణ

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : 2024 నవంబర్ 8,  9 తేదీల్లో జేఎన్టీయూ హైదరాబాద్‌లో జరగనున్న జోనల్ రీసెర్చ్ స్కాలర్ కాన్క్లేవ్ ఆన్ రీసెర్చ్ ఫర్ రేడియంట్ భారత్ పోస్టర్ ను తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరి రావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమాన్ని పరిశోధన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు. పరిశోధనలలో లోతైన అధ్యయనం జరగాలని , నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, సమాజంలో బాధ్యతాయుతమైన అంశాల పైన పరిశోధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఐ సి  ఎస్ ఆర్, యు జి సి , జేఎన్టీయూ, సంయుక్తంగా  నిర్వహిస్తున్నాయని  షోద్ ప్రతినిధి గౌతమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, డాక్టర్, తెలంగాణ యూనివర్సిటీ పబ్లికేషన్స్ డైరెక్టర్ సత్యనారాయణ, డాక్టర్ టి ప్రతిజ్ఞ, డాక్టర్ ఎస్ నారాయణగుప్త   శోద్ ప్రతినిధి బృందం పాల్గొన్నారు.