మాలల ఆత్మ గౌరవ సభ కరపత్రాల ఆవిష్కరణ
రుద్రూర్, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 27 ఆదివారం రోజున తలపెట్టిన మాలల ఆత్మ గౌరవ సభకు సంబంధించిన కరపత్రాలను బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాల పొలిటికల్ జేఏసీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ మాల మాట్లాడుతూ.. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలందరు కార్యక్రమానికి హజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నవీన్ కుమార్, కిశోర్, కోర్భ శ్యామ్, కార్తీక్ , వినోద్, ప్రవీణ్, సంతోష్...