Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2025, 5:06 pm Posted by : ramakrishna

ముదిరాజ్ జెండా ఆవిష్కరణ

ఇందల్వాయి,బతుకమ్మ : మండలంలోని ఇందల్వాయి పెద్దమ్మతల్లి ఆలయంలో ధర్పల్లి మాజీ ఎంపీపీ రాష్ట్ర ముదిరాజ్ అధ్యక్షులు ఇమ్మడి గోపి ఆధ్వర్యంలో ఉదయం ముదిరాజుల జెండా ఆవిష్కరించారు.ఇందులో భాగంగా అనంతరం ప్రతి సంవత్సరంలాగే వసంత పంచమి రోజు సందర్భముగా సరస్వతి మాతకు పూలమాలలు అనంతరం మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి మాట్లాడుతూ ముదిరాజులు రాష్ట్రంలోనే అందరికంటే అధిక సంఖ్యలో ఉన్నామని ముదిరాజులంతా ఏకమైతే ఏదైనా సాధించవచ్చు అనే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోవు ఎలక్షన్ లో ముదిరాజులంతా ఏకమై ముదిరాజులకు సంబంధించిన ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ తరపునైనా ఏదో ఒక పోటీ చేయాలి పోటీ చేసిన వారికి ముదిరాజులు కక్షలు కోపాల్ని పక్కన పెట్టుకొని ముదిరాజు బిడ్డల్ని రాజకీయ నాయకులుగా చూడాలని రాజకీయాల్లో విజయం సాధించాలి అని ముందు ముందు అన్ని రంగాల్లో ముదిరాజులు ముందుండాలని ఆయన ఈ సందర్భంలో తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇమ్మిడి గోపి తో పాటు ముదిరాజ్ యూత్ అధ్యక్షులు సుమన్, లోకని గంగారం,మోచ్చే గోపాల్, బుట్టి ప్రదీప్, లోకని గోపి, మచ్చే గంగ సాయిలు, మెండే చిన్న సాయిలు, మెండే అశోక్, లోకని గంగాధర్ పాల్గొన్నారు.