Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 December 2024, 3:06 pm Posted by : ramakrishna

మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నూతనంగా నిర్మించిన మాతాశిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ నూతన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, ధన్‌ పాల్‌ సూర్యనారాయణ గుప్తా, నుడా ఛైర్మన్‌ కేశ వేణు, సహకార యూనియన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, మేయర్‌ నీతూ కిరణ్‌, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.