నిజామాబాద్ 43వ డివిజన్‌లో ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలోని 43వ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సొంత గృహాలను అందించాలనే లక్ష్యంతో ఈ గృహాలను ప్రభుత్వం నిర్మించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ హాజరై లబ్ధిదారులకు గృహాలను అందజేశారు. సొంత ఇల్లు పొందిన కుటుంబాల ఆనందంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ గృహాల పథకం సామాజిక న్యాయం మరియు సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తోందని...