Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 7:29 pm Posted by : ramakrishna

సాలంపాడ్‌లో నూతన భవన ప్రారంభోత్సవం

బోధన్, బతుకమ్మ :

 

సాలంపాడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు సహా పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. అనంతరం తాహేర్ బిన్ హుందాన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేయలేనటువంటి కార్యక్రమాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందన్నారు. బోధన్ నియోజకవర్గ రైతులకు బోనస్, రుణమాఫీ, తెల్ల రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహేర్ బిన్ హుందాన్, గ్రంథాలయ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, గ్రామ సర్పంచ్ నర్మదా సంతోష్ రెడ్డి, సాలూర ఎమ్మార్వో శశిభూషణ్, ఎంపీడీవో శ్రీనివాస్, సాలంపాడు గ్రామ సెక్రటరీ హరిత, కోపర్తి క్యాంప్ సర్పంచ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

 

Inauguration of a new building in Salampad
Inauguration of a new building in Salampad