రేపు సంక్షేమ వసతి గృహాల్లో డైట్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాలు
వీ.సీ ద్వారా అధికారులతో ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలి నిజామాబాద్ , బతుకమ్మ : ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నందున జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని0 పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు,ఆర్సిఓ లు,ఎంపీడీఓలు,తహశీల్దార్లతో కలెక్టర్ రాజీవ్...