Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 8:58 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే మదన్ మోహన్ పై అనుచిత వ్యాఖ్యలు సరి కాదు

 

. . . మాజీ ఎమ్మెల్యే సురేందర్ క్షమాపణలు చెప్పాలి

 

. . . కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయిరాం యాదవ్

 

లింగంపేట్, బతుకమ్మ

 

బీఆర్ఎస్ పార్టీ విస్త్రత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పై, మాజీ ఎమ్మెల్యే సురేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని, సురేందర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయిరాం యాదవ్ అన్నారు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సాయిరాం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదన్ మోహన్ అభివృద్ధి చేస్తుంటే సురేందర్ ఓర్వలేక ఈ వ్యాఖ్యలు చేశాడని అన్నారు. లింగం పేట్ కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్ గ్రామానికి చెందిన సాయిలు అనే రైతు వడ్ల కుప్ప పై పడి చనిపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హన్మంత్ రావు ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయడానికి మదన్ మోహన్ కృషి చేశాడన్నారు. నీ సొంత గ్రామం నల్ల మడుగు లో పాము కాటుతో రైతు చనిపోతే సీఎం రేవంత్ ని తీసుకువచ్చి ఆ రైతు కి ఆర్థిక సహాయం అందించిన వ్యక్తి మదన్ మోహన్ అని గుర్తు చేశారు. ఇప్పటి వరకు కనీసం వారిని పరామర్శించని నీకు మదన్ మోహన్ ని అనే అర్హత లేదని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనార్టీ సెల్రఫీయొద్దీన్ లింగంపేట సర్పంచ్ కౌడా రవీందర్, టౌన్ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సక్రనాయక్, సర్పంచ్ అట్టెం శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు ఎల్లమయ, సహకార సంఘం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, డాక్టర్ విట్టల్ పోల్ సింగ్, హర్షద్ గుండా, ఏ.బాలకిషన్, సర్పంచ్ కాశీరం, సర్పంచ్ ఏగొండ, సర్పంచ్ అమృత రావు, గోపాల్ వెంకట్ గౌడ్, లింగంపేట్ మండల కాంగ్రెస్ సర్పంచ్ లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.