ఆరోపణల నేపథ్యంలో బల్దియాలో కంటితుడుపు చర్యలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకే మళ్ళీ ఎస్సైలుగా బాధ్యతలు రెగ్యులర్ ఉద్యోగులపై వారిదే పెత్తనం బతుకమ్మ, నిజామాబాద్ : ఇటీవల కాలంలో మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారుల విధుల మీద అనేక ఆరోపణలు వొస్తున్న నేపథ్యంలో బుధవారం పారిశుధ్య, ఆరోగ్య విభాగంలో పని చేయుచున్న శానిటరీ ఇన్స్పెక్టర్స్ సర్కిల్ సూపర్ వైజర్ ఆఫీసర్లను ప్రస్తుతం వారు పనిచేయుచున్న సర్కిల్ నుండి ఇతర సర్కిల్స్ కి బదిలీ చేస్తూ కమిషనర్ మంద మకరంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దశల వారీగా అన్ని విభాగాలలో ప్రక్షాళన చేస్తూ...