Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2025, 4:14 pm Posted by : ramakrishna

నూతన సంవత్సరంలో నూతనోత్తేజమే..

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

 

నిజామాబాద్, బతుకమ్మ : గతాన్ని ప్రస్తుత జీవితంలో గణిస్తూ తప్పుఒప్పుల లెక్కలు సరిచూసుకుని ముందడుగులు వేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాకోర్టు ప్రాంగణంలోని పిపి గంగారెడ్డి మెమోరియల్ హల్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలను బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్,ఉపాఢ్యక్షుడు రాజు,ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కార్యదర్శి దొన్పల్ సురేష్, కోశాధికారి దీపక్ లతో కలిసి కేక్ ను కట్ చేసి నూతన సంవత్సరంలో అందరికి శుభాలే కలగాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.గడిచిన కాలం ఎన్నో పాఠాలు నేర్పిందని,జీవనపయనంలో మరెన్నో నిత్యజీవిత పాఠాలు నేర్చుకోవల్సింది ఉన్నదని ఆమె పేర్కొన్నారు. బార్ అండ్ బెంచ్ సమన్వయంతో ముందుకు సాగుతూ న్యాయార్థుల పక్షమే వెళుతున్నాయని తెలిపారు. బార్ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ న్యాయమూర్తులు,న్యాయవాదుల ఆలోచనలు, న్యాయ వ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా ఉన్నాయని అన్నారు.జ్యూడిషియరీ విలువలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జీలు ఆశాలత, శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు,జూనియర్ సివిల్ జడ్జీలు కుష్భు ఉపాధ్యాయ్, గోపికృష్ణ,హరి కుమార్, శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.