Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 12:07 pm Posted by : ramakrishna

 8 గంటలుగా శ్మశానంలో 

మహబూబ్‌నగర్‌, బతుకమ్మ :  బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నానని ఓ తండ్రి శశ్మానవాటికలో విలపించాడు.  ఈహృదయవిదారక సంఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది.   వివరాల్లోకి వెళ్తే..  మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో పత్తి మిల్లులో పని చేస్తూ భార్య, ఇద్దరు కుమారులను పోషిస్తూ బాలరాజ్ అనే వ్యక్తి జీవనం సాగించేవాడు.  ఇటీవల పత్తి మిల్లు మూతపడి ఉపాధి కోల్పోవడంతో, భర్త, దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని వదిలేసి, చిన్న కుమారుడితో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.  బాలరాజ్ స్థానికంగా హోటల్లో పని చేస్తూ పెద్ద కుమారుడిని పోషిస్తున్న క్రమంలో, తీవ్ర అనారోగ్యంతో  పెద్ద కుమారుడు హరీష్(8) మృతి చెందాడు.  కొడుకు అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక, శ్మశానంలో మృతదేహాన్ని పట్టుకుని 8 గంటలపాటు ఏడుస్తూ .. బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నానని బాలరాజ్ కన్నీరు పెట్టుకున్నాడు.