సులేమాన్ నగర్ లో అధికారులను నిలదీసిన గ్రామస్తులు

. . . గ్రామస్తులను  శాంతింపజేసిన ఏసీపీ రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి , సులేమాన్ నగర్ , రాయకూర్ గ్రామాలల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద బుధవారం ప్రజా పాలన గ్రామసభలను నిర్వహించారు. కాగా సులేమాన్ నగర్ గ్రామంలో అధికారులకు ప్రజలు చుక్కలు చూయించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పథకాలపై అర్హులైన వారి పేర్లను అధికారులు చదివి వినిపించారు. అయితే ఈ పథకాలలో రేషన్ కార్డుల జాబితాలో 350 మంది దరఖాస్తులు...