Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2024, 11:32 am Posted by : ramakrishna

సిరికోండ రెంజ్ లో ఇద్ధరు ఆటవి అధికారులపై వేటు

… అడవిని నరికి పంటలను సాగు చేస్తున్న వారిపై కేసులు

బతుకమ్మ, నిజామాబాద్:

నిజామాబాద్ జిల్లా సిరికోండ ఫారెస్టు రేంజ్ పరిధిలో జరుగుతున్న ఆటవి భూముల ఆక్రమణలు, పంటల సాగు, చెట్ల నరకడంపై ఆటవిశాఖాధికారులు ఆలస్యంగా స్పంధించారు. ఇటివల సిరికోండ్ల మండలం రావుట్ల సెక్షన్ పరిధిలోని జంగిలోడి తాండా లో ఆటవి భూమిని ఆక్రమించి పంటల సాగు చేస్తున్న విషయంలో  విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహంచిన ఫారెస్టు సెక్షన్ ఆఫిసర్ వసంత్ రావును సస్పెండ్ చేశారు. బేస్ క్యాంపు ఉద్యోగి నరేంధర్ ను విధుల నుంచి తోలగించినట్టు సిరికోండ ఎప్ఆర్ఒ  ఎం వినాయక్ తెలిపారు. రావుట్ల సెక్షన్ పరిధిలోని బిట్ లలో ఆటవి భూములలో సాగుకోసం చెట్లను నరకడంతో పాటు ఈ నెల 19న పంటలను తోలిగించడానికి వచ్చిన ఆటవి అధికారులపై ఎదురు తిరిగిన తాండా వాసులపై సిరికోండ పోలిస్ స్టేషన్ లో పిర్యాదుచేయగా కేసులు నమోదు చేశారు.