Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2024, 4:42 pm Posted by : ramakrishna

జిల్లాలు మారిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలి

. . . ప్రభుత్వం ఇచ్చిన  హమీ మేరకు 317 జిఓ ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు బదిలీ చేయాలి

. . . డేటా అధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిరసన

. . . మద్ధత్తు పలికిన ఉపాధ్యాయ సంఘాలు

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

గత ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, వెంటనే బాధితులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులు  డిమాండ్‌ చేశారు. ఆదివారం  317 జివో 317 డిస్లోకేటేడ్ ఎంప్లాయిస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ (డేటా) రాష్ట్ర నాయకులు పడకంటి-అజయ్, కుమార్, దత్తాద్రి, నిజామాబాద్ జిల్లా నాయకులు దినేష్, సురేష్, మారుతి, ప్రవీణ్, వినాయక్, నర్సయ్య, శివ ప్రసాద్, రాజేష్, రమేష్, మహేశ్వరి  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిజామాబాద్ దర్నా చౌక్ లో నిర్వహించారు.

In GO 317, justice should be given to all the employed teachers who have changed districts

 

 

ఉద్యోగ ఉపాధ్యాయులు వారు పడుతున్న ఇబ్బందులను వివరించారు.ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు పి అర్ టి యు అద్యక్షులు మోహన్ రెడ్డి, టి ఎస్ యు టి ఎఫ్ అద్యక్షులు సత్యనంద్, ఉపాధ్యాయ నాయకులు కృష్ణవేణి, శ్రీకాంత్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెనిగల్ల సురేష్, కేశ పురం రమేశ్ లు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా  ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ..నిజామాబాద్ లో 317 జివోలో భాగంగా జిల్లాలు మారిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ న్యాయం కోసం ధర్మ పోరాటంలో దీక్షలో పాలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ వారి జిల్లాలకు కేటాయించాలని అన్నారు. గత ప్రభుత్వం హయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల వల్లనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యున్నతి సాగుతుందని, ఉపాధ్యాయులు మాత్రం ఇతర జిల్లాలకు పంపడం వలన కుటుంబానికి దూరమై, చిన్న చిన్న పిల్లలను వదిలేసి ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు.

 

In GO 317, justice should be given to all the employed teachers who have changed districts