Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 5:15 pm Posted by : ramakrishna

బాధ్యతలు స్వీకరించిన ఇంచార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా

 

. . . స్వాగతం పలికిన అదనపు కలెక్టర్, అధికారులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ గా భవేష్ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10.45 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న ఇంచార్జి కలెక్టర్ ను అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ ను వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమావేశమై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

 

In-charge Collector Bhavesh Mishra assumes charge.