విశ్వవిద్యాలయంలో చదువుతోపాటు పరిశోధనలపై కేంద్రీకరించాలి
రిటైర్డ్ లెక్చరర్ ఏ.భుజంగం నిజామాబాద్ సిటి, బతుకమ్మ : విశ్వవిద్యాలయంలో చదువుతోపాటు పరిశోధనలపై కేంద్రీకరించాలని రిటైర్డ్ లెక్చరర్ ఏ.భుజంగం అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ ఆరతి అధ్యక్షతన పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ లెక్చరర్ ఏ.భుజంగం హాజరై ప్రసంగిస్తూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని విశ్వవిద్యాలయ వనరులను వినియోగించుకొని అత్యుత్తమంగా ఎదగాలన్నారు. విద్యార్థి జీవితంలో సమయం చాలా ముఖ్యమైనదని, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లే విజేతలుగా నిలబడ్డారన్నారు. సహజంగా ...