Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 7:10 pm Posted by : ramakrishna

విశ్వవిద్యాలయంలో చదువుతోపాటు  పరిశోధనలపై కేంద్రీకరించాలి 

రిటైర్డ్ లెక్చరర్  ఏ.భుజంగం

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : విశ్వవిద్యాలయంలో చదువుతోపాటు  పరిశోధనలపై కేంద్రీకరించాలని రిటైర్డ్ లెక్చరర్  ఏ.భుజంగం అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం  ప్రిన్సిపల్  ఆచార్య సిహెచ్  ఆరతి  అధ్యక్షతన  పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ లెక్చరర్  ఏ.భుజంగం హాజరై ప్రసంగిస్తూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని విశ్వవిద్యాలయ వనరులను వినియోగించుకొని  అత్యుత్తమంగా ఎదగాలన్నారు.  విద్యార్థి జీవితంలో సమయం చాలా ముఖ్యమైనదని, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లే  విజేతలుగా నిలబడ్డారన్నారు.  సహజంగా  ప్రతి విద్యార్థికి తెలివితేట ఉంటాయన్నారు.  తెలివితేటలను బాధ్యతగా ఉపయోగించుకున్న వాళ్లే  జీవితంలో స్థిరపడతారని పేర్కొన్నారు.  విశ్వవిద్యాలయ జీవితం చాలా విలువైనదని విద్యార్థులందరూ  అకాడమిక్ విద్యతోపాటు,లోతైన పరిశోధనలపై మనసును కేంద్రీకరించి నూతన ఆవిష్కరణల పై దృష్టి సారించాలని సూచించారు.  విద్యార్థినీ విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉండి  మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండాలన్నారు.  దీని కొరకు క్రీడలు, సంగీతం, యోగా,మెడిటేషన్ వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్  ఆచార్య గంటా చంద్రశేఖర్, యూజీసీ డైరెక్ట్ ర్ ఆచార్య ఆంజనేయులు,  ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య రవీందర్ రెడ్డి, బోధన బోధ నేత్ర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

In addition to studying in the university, one should focus on research