ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గురువారం సుమారు4 లక్షల 50వేల రూపాయలతో ఏర్పాటుచేసిన ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ ను గురువారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం,సెస్ డైరక్టర్ వర్స కృష్ణ హరి లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామంలోని బాలసంతుల కాలనీలో 18 ఇండ్లకు నిరంతర విద్యుత్తును అందించే విధంగా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. అదే మాదిరిగా మంచినీటి సరఫరా కు,ఇబ్బంది లేకుండా 24 గంటల విద్యుత్ సౌకర్యం కలిగే విధంగా పెద్దమ్మ ఒర్రె వద్ద మంచినీటి బోరుకు నిరంతర విద్యుత్ సరఫరా ప్రక్రియను ఏర్పాటు చేశారు. అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ గ్రామంలో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని అదనంగా గ్రామంలో మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గ్రామానికి మంచినీటి సరఫరా ఎప్పుడు అయ్యే విధంగా మానేరువాగులో మంచినీటి బావికి నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరామనవమి సందర్భంగా రథానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా,విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయాలని సెస్ ఎ ఇ పృథ్వి, డైరెక్టర్ వరుస కృష్ణ హరి లకు గ్రామపంచాయతీ తీర్మానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, హెల్పర్ సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్,నాయకులు నిమ్మ నారాయణరెడ్డి,మల్లారెడ్డి, దొమ్మాటి దేవయ్య,వంగల లక్ష్మణ్ గ్రామస్తులు పాల్గొన్నారు.