క్యారమ్స్ ఆటతో కనుచూపు మెరుగు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆటపాటలతో ఆనందం పెరిగి,మానసిక ప్రశాంతత చేకూరుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. సోమవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ క్యారమ్స్ ఆటలపోటీలను ప్రారంభించి కొద్దిసేపు క్యారమ్స్ ఆడారు. అనంతరం మాట్లాడుతూ మనుషుల నిత్యజీవనంలో ఆటపాటలు ఉంటేనే సంతోషాలు వెల్లివిరుస్థాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న శుభతరుణంలో బార్ అసోసియేషన్ వివిధ రకాల క్రీడా కార్యక్రమాలు చేపట్టడం ముదావహమని ఆమె కొనియాడారు. క్యారమ్స్ పై ఆడేటపుడు దృష్టికోణం...