Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 7:11 pm Posted by : ramakrishna

దాబాల యజమానులకు జైలు శిక్ష

బతుకమ్మ, బోధన్ :సమయానికి మించి నడుపుతున్న దాబా, హోటల్ యజమానులకు జైలు శిక్ష విధిస్తూ బోధన్ కోర్టు న్యాయ మూర్తి శేష సాయి తల్ప తీర్పు వెల్లడించారు. బోధన్ పట్టణంలో చాందిని దాబా, కిసాన్ దాబా, ఆన్సర్ హోటల్ ,స్ప్రింగ్ బేకరీ నిర్వాహకులు అర్ధ రాత్రి దాటిన తరువాత కూడా హోటళ్ళు నిర్వహిస్తున్నారు. ఇందు వలన ఎదురవుతున్న ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకొని పోలీసులు కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.వీరికి న్యాయ మూర్తి రెండు రోజులు జైలు శిక్ష విధించారు.