కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి ఏడాది జైలు

బతుకమ్మ, నిజామాబాద్ : అధికారిక విధులు నిర్వహిస్తున్న అధికారులపై దాడిచేసి,వారి విధులకు ఆటంకం కలిగించిన మహమ్మద్ మునవర్ ,మహ్మద్ అఖ్లాక్ అహ్మద్ లకు వేరువేరు కేసులలో జైలుశిక్ష విధిస్తూ నిజామాబాద్ రెండవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పాముజుల శ్రీనివాస్ రావు శుక్రవారం తీర్పు చెప్పారు. నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ లో గల తెలంగాణ సూపర్ మార్కెట్ పురాని హావేలి దగ్గర పోలీస్ కానిస్టేబుల్ సయ్యద్ హమీద్ ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు ఆ ప్రాంతంలోని పరిస్థితులపై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు....