కరెంటు వైరు అమర్చి మరొక వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తికి జైలు
ఐదు సంవత్సరాలు జైలు శిక్ష 15 వేల జరిమానా విధింపు బతుకమ్మ, కామారెడ్డి : పొలం వద్ద జంతువుల నుంచి రక్షణ కొరకు ఏర్పాటుచేసిన విద్యుత్ కంచెను నిర్వహణలో నిర్లక్ష్యం చేసి వ్యక్తి మరణానికి కారకుడైన మరొక వ్యక్తికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మేంగారం గ్రామానికి చెందిన చౌల దత్తు ( 25 )అను వ్యక్తి 14 అక్టోబర్ 2018 న రాత్రి 9...