ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడింగ్ విన్యాసాలు

 పారామోటర్ ఎక్స్ పెడిషన్ యాత్రకు స్వాగతం పలికిన అదనపు కలెక్టర్   నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏఓసీ కార్ప్స్ డే ను పురస్కరించుకుని సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో పారా మోటార్ ఎక్స్ పెడిషన్ -2025 పేరుతో యాత్రను చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీ నుండి ప్రారంభం అయిన ఈ యాత్ర ఆగ్రా, కాన్పూర్, ఝాన్సీ, సాగర్, జబల్పూర్,...