ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. బీజేపీ నేతల కీలక సమావేశం

హైదరాబాద్, బతుకమ్మ:  డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ దూసుకుపోతుంది. ఈనేపథ్యంలో బీజేపీ పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నేతలు కీలక సమావేశం నిర్వహించారు.  తెలంగాణలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవాలని శ్రేణులకు కిషన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.  బీజేపీతోనే నిజాయితీ పాలన సాధ్యమని డిల్లీ ప్రజలు విశ్వసించారని కిషన్ రెడ్డి వ్యాఖ్యనించారు.