Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 9:40 pm Posted by : ramakrishna

డయల్ – 100 కు తక్షణ స్పందన

 

. . . మహిళ ప్రాణాలు కాపాడిన పిట్లం పోలీసులు

 

పిట్లం, బతుకమ్మ :

 

డయల్ – 100 కు వచ్చిన అత్యవసర సమాచారంపై పిట్లం పోలీసులు వేగంగా స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడారు. రామాలయం చెరువులో దూకిన మహిళను స్థానిక ఎస్‌ఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో సురక్షితంగా బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి మహిళను చెరువులో నుంచి సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ సమస్యలకు ఆత్మహత్య ఎప్పుడూ పరిష్కారం కాదని, వ్యక్తిగత, కుటుంబ లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు నిరాశకు లోనుకాకుండా వెంటనే పోలీసులను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని, ప్రజలకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.