Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 3:40 pm Posted by : ramakrishna

చెత్త కుప్పలో ఐమాక్స్ పోల్

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్ర పరిధిలోని ఎన్ హెచ్ 44 జాతీయ రహదారి ప్రక్కనగల ఇందల్వాయి  గ్రామానికి వెళ్లే ముఖ ద్వారం వద్ద గతంలో ఐమాక్స్ పోల్ లైట్లు అమర్చారు. గత వారం రోజుల క్రితం లారీ ఢీకొని ఐమాక్స్ ఫోల్ నేలకూలి కింద పడడంతో మరమ్మత్తులు చేయకుండా చెతకుప్పలో పడేశారు. దీంతో ఇందల్వాయి గ్రామానికి చెందిన గ్రామస్తులు రాత్రి వేళలో ఐమాక్స్ లైట్లు వెలగకపోవడం వారం రోజుల నుండి మరమ్మత్తులు చేయకపోవడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇందల్వాయి గ్రామాభివృద్ధి కమిటీ గానీ,సిబ్బంది గానీ ఇప్పటివరకు పట్టించుకునే పాపాన పోలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఇందల్వాయి గ్రామ అభివృద్ధి కమిటీ,గ్రామ సిబ్బంది పట్టించుకోని పడిపోయిన ఐమాక్స్ ఫోల్, లైట్లకు మరమ్మత్తులు చేసి  పొల్ సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.