Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2024, 4:20 pm Posted by : ramakrishna

బాదం ఆకుపై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రం

_చిత్రకళ ఉపాధ్యాయుడు
_ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా
బతుకమ్మ, మద్నూర్: బాదం ఆకుపై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రం మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడు (ఆర్ట్ టీచర్) విధులు నిర్వహిస్తున్న బాస బాల్ కిషన్ చిత్రికరించాడు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం బాదం ఆకుపై చిత్రీకరించిన సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రం ఇచ్చి తోటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. దాంతో ప్రధానోపాధ్యాయుడు రాజేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది చిత్రకళ ఉపాధ్యాయుడు బాస బాల్ కిషన్ ను సన్మానించి,ధన్యవాదాలు తెలిపారు. పిల్లలు సిబ్బంది పాల్గొన్నారు.

Image of Sarvepalli Radhakrishna on almond leaf