Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2025, 4:21 pm Posted by : ramakrishna

దోసకాయపై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం

మద్నూర్ బతుకమ్మ : హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ దోసకాయపై ఛత్రపతి శివాజీ మహరాజ్ చిత్రం గీసి ఆకట్టుకున్నారు. దీన్ని చూసిన చూపరులు బాస బాల్ కిషన్ ను అభినందించారు. బాస బాల్ కిషన్ వినూత్నంగా చిత్రాలు వేసే కళాకారుడిగా గుర్తింపు పొందారు.