సీపీని కలిసిన ఐఎంఏ కార్యవర్గం

సీపీకి హెల్మెట్ అందజేసిన ఐఎంఏ   నిజామాబాద్, బతుకమ్మ :  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతనంగా ఎంపికైన కార్యవర్గం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్యను మర్యాదపూర్వకంగా కలిసారు. ఐఎంఏ అధ్యక్షులు డా.విశాల్ ఆకుల ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం మంగళవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, ప్రజాఆరోగ్యం విషయంలో ఐఎంఏ, పోలీసు శాఖ పని చేయాలని నిర్ణయించారు. ఐఎంఏ నూతనంగా రూపొందించిన వేర్ హెల్మెట్ సేవ్ ఏ లైఫ్ అనే టీషర్టులను సీపీ ఆవిష్కరించారు....