- సీపీకి హెల్మెట్ అందజేసిన ఐఎంఏ
నిజామాబాద్, బతుకమ్మ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతనంగా ఎంపికైన కార్యవర్గం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్యను మర్యాదపూర్వకంగా కలిసారు. ఐఎంఏ అధ్యక్షులు డా.విశాల్ ఆకుల ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం మంగళవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, ప్రజాఆరోగ్యం విషయంలో ఐఎంఏ, పోలీసు శాఖ పని చేయాలని నిర్ణయించారు. ఐఎంఏ నూతనంగా రూపొందించిన వేర్ హెల్మెట్ సేవ్ ఏ లైఫ్ అనే టీషర్టులను సీపీ ఆవిష్కరించారు. సీపీని కలిసిన వారిలో ఐఎంఏ సభ్యులు డా.జీవన్ రావు, డా.వినోద్ కుమార్ గుప్త, డా.రమణేశ్వర్ లు ఉన్నారు.
