అధికారుల అండతో కొండలను పిండి చేస్తున్న అక్రమార్కులు

పోలీసు, రెవెన్యూ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం బతుకమ్మ: బిచ్కుంద : మొరం అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. జుక్కల్ నియోజకవర్గ పరిధిలో మొరం మాఫియా రోజురోజుకూ కొత్తరూపం దాల్చుతోంది. అనుమతులు లేకుండానే అడ్డగోలుగా మొరం అక్రమ తవ్వకాలు చేపడుతూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. బిచ్కుంద, జుక్కల్, మద్నూర్ మండలకేంద్రాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని పరిసర ప్రాంతాల్లో ఉన్న గుట్టలను తవ్వి బొందల గడ్డగా మార్చుతున్నారు. మొరం తవ్వకాల పేరుతో కొండలను సైతం పిండి చేస్తున్నారు. పోలీసు రెవెన్యూ శాఖ అధికారులు...