బతుకమ్మ, భిక్కనూరు:
స్థానిక ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలో నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్నట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాల్లోకి వెళితే భిక్కనూరు బస్టాండ్ సమీపంలో బుధవారం ఎఫ్ ఎస్ టి టీం వాహనాలు తనిఖీ చేస్తుండగా జంగంపల్లి రైస్ మిల్లులో పనిచేసే బీహార్ కూలీలు అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందన్నారు. మద్యం విలువ 6,170 ఉన్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ బాలయ్య పోలీసు సిబ్బంది ఉన్నారు.