Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 11:45 am Posted by : ramakrishna

అక్రమంగా గోవుల రవాణా.. వాహనం పట్టివేత

రుద్రూర్, బతుకమ్మ  : అక్రమంగా గోవులను రవాణా చేస్తున్న వాహనాన్ని బజరంగ్ దళ్ నాయకులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రెంజల్ మండలం సాటాపూర్ నుంచి రుద్రూర్ మీదుగా జహీరాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ వాహనంలో సుమారు 16 గోవులను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ వాహనాన్ని బజరంగ్ దళ్ నాయకులు గణేష్, ప్రశాంత్ గౌడ్, ధర్మారం వెంకటేష్,  అనిల్ లు అర్థరాత్రి ఒంటి గంటకు పట్టుకున్నారు. రుద్రూర్ ఎస్సై సాయన్నకు సమాచారం అందించగా, ఎస్సై సహాయంతో గోవులను బోధన్ గోశాలకు తరలించారు. ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు.