బతుకమ్మ, భిక్కనూరు: గోమాతను పూజించే సమాజంలో గుండె తరుక్కుపోయేలా ప్రవర్తిస్తున్నారు. కొందరు నోరులేని మూగజీవాలను లారీలో కుక్కి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు శుక్రవారం మధ్యాహ్నం లారీలో గోవులను కుక్కి హైదరాబాద్ వైపు అక్రమంగా తరలిస్తుండగా బస్వాపూర్ దగ్గర భిక్కనూర్ మండల బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు లారీని ఆపి తనిఖీ చేయగా దానిలో ఆవులు కనిపించాయి. దీంతో లారీని స్వాధీన పరచుకొని మద్దికుంట గోశాలకు తరలించారు.ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గోరక్ష కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
