Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2025, 3:36 pm Posted by : ramakrishna

కోటగిరిలో విచ్చలవిడిగా మొరం అక్రమ రవాణా

  • పట్టించుకోని రెవెన్యూ,పోలీసు అధికారులు
  • ఎక్లాస్పూర్ రాంపూర్ గుట్టల్లో భారీగా మొరం తవ్వకాలు
  • రూపాయి రాయల్టీ కట్టకున్నా పరిమిషన్లు ఇస్తున్న స్థానిక ఎమ్మార్వో

 

కోటగిరి, బతుకమ్మ: కోటగిరి మండల కేంద్రం నుండి యదేచ్చగా అక్రమ మొరం రవాణా కొనసాగుతుంది. బుధవారం మార్కెట్ రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కోటగిరీకి వస్తుంటారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా హాలిడే కావడంతో మొరం రవాణా జోరుగా కొనసాగుతుంది. గురువారం కోటగిరి బస్టాండ్ నుండి విచ్చలవిడిగా మొరం తీసుకుపోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పేద ప్రజలు మొరం కావాలంటే నానా ఇబ్బందులు పెట్టే అధికారులు కొత్తగా కట్టే రైస్ మిల్లులకు మాత్రం రూపాయి రాయల్టీ కట్టకుండా గాని మొరంకు పర్మిషన్లు ఇస్తున్నారు. కోటగిరి చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు పది  రైస్ మిల్లులు కొత్తగా నిర్మిస్తున్నారు. ఆ రైస్ మిల్లు వాళ్ళు ఎమ్మార్వో ను కలిసి మాట్లాడుకుంటే గవర్నమెంట్ కు రూపాయి కట్టకున్నా ఎమ్మార్వో గారు వాళ్లకు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారు. కోటగిరి మండల కేంద్రంలో మొరం టిప్పర్లు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అక్రమ మొరంను అడ్డుకోవాల్సిన అధికారులే వాళ్లకు సపోర్ట్ చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఒకవైపు గుట్టలు మాయం అయిపోతుంటే అధికారులు మాత్రం తమకు మామూల్లు వస్తే సరిపోతుందన్నట్లు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గరీబోళ్లకు మొరం కావాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టిన రాదు కానీ రైస్ మిల్లులకు మాత్రం రూపాయి ఖర్చు పెట్టకుండా తమ దగ్గరకు వందల ట్రిప్పుల మొరం వచ్చి పడుతుండటం అధికారుల చేతగానితనానికి నిదర్శనం. ఈ విషయంపై ఉన్నతరాధికారులు వెంటనే చర్యలు తీసుకుని స్థానిక అధికారుల దురాగతాలకు చరమగీతం పాడాలని ప్రజలు కోరుతున్నారు.

Illegal trafficking of Moram is rampant in Kotagiri