సుర్బిర్యాల్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు సీజ్
చట్టమే అంతిమమని రుజువు విడిసిల ఆధిపత్యానికి చెక్ ఆర్మూర్, బతుకమ్మ : ఆధిపత్యం, అణచివేత, సామాజిక వెలివేత, చట్టం మాకు లెక్కలేదనే భావాజాలం, మేము చేసిన తీర్మాణమే అంకుశం అంటు పెడపోకడలకు పోయిన గ్రామ అభివృద్ధి కమిటీల అన్యాయపు ఆగడాలు అంతం అయ్యేదిశగా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే అనుకోవాల్సి వస్తున్నది. ఒక కులాన్నే లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టిలో పడిన తాళ్ళ రాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ అఖరుకు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా...